Skip to main content

Posts

Showing posts from August, 2025

భగవద్గీత - అధ్యాయం - 3

అర్జున : కృష్ణా, కర్మ చెయ్యటం కంటే జ్ఞానము, స్థిత ప్రజ్ఞతే శ్రేష్టమైతే. ఈ ఘోరమైన యుద్ధమనే కర్మని ఎందుకు చెయ్యమంటున్నావు. నీ మాటలతో నాకు మరింత గజిబిజిగా ఉంది. నాకు శ్రేయస్కరమైన మార్గమేదో సూటిగా చెప్పు. కృష్ణ : ఈ ప్రపంచాన్ని సృష్టించేటప్పుడే రొండు మార్గాలను కూడా సృష్టించాను. జ్ఞానాన్ని కోరుకునేవారికి సంఖ్యా శాస్త్రాన్ని, యోగులకు కర్మయోగాన్ని. కేవలం బౌతికంగా కర్మలను చేయకపోవటం వల్ల కర్మ ఫలితంపై ద్యాస పోదు, అలానే కర్మలను వదలుట వల్ల జ్ఞానము సిద్దించదు. కేవలం భౌతికంగా కర్మలకు దూరంగా ఉంటూ, వాటి గురించి ఆలోచిస్తూ ఉండటం పాపమే. ప్రజ్ఞాశాలి తను చేయవలసిన కర్మలను ఫలితం గురించి ఆలోచించకుండా చేయును. బాధ్యతలను విస్మరించడం వల్ల జీవిత ప్రయాణం సాఫీగా సాగదు.  ముల్లోకాలలో నేను పొందవలసినది ఏదీ లేదు, కానీ నన్ను అనుసరించే జనుల ప్రయోజనం కోరి, వారికి మార్గదర్శనంచేయుటకు కర్మలను ఆచరిస్తూనే ఉంటాను. ఆలా నేను చెయ్యకపోతే, నన్ను అనుసరించే జనులు కూడా వారు చెయ్యవలసిన కర్మలను చెయ్యటం మానేస్తారు. ఇది జగత్తుకు మంచిది కాదు. పూర్ణజ్ఞాని ఐన వాడు అల్పజ్ఞాని ఐన వారిని, వారి దారినుండి వైదొలగించరాదు. ఆసక్తి లేకపోయినా కూడా, లోక...