How can I forget this masterpiece from Maha Prasthanam. How Sri Sri has summarized the history of every nation in his blunt words
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణతం
నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహరణోద్యోగం. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం
బీభత్సరస ప్రధానం పిశాచగుణ సమవాకారం. నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులని కాల్చుకుతినటం.
బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు. నరహంతులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి.
రణరంగం కానిచోట భూస్థలమంతా వెదకిన దొరకదు. గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళులతో.
చల్లారిన సంసారాలు, మరణించిన జన సందోహం, అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నవి.
వైషమ్యం, స్వార్ధపరతం, కౌటిల్యం, ఈర్షలు, స్పర్ధలు. మాయలతో మారు పేర్లతో చరిత్రగతి నిరూపించినవి.
చెంఘీజ్ ఖాన్, తామర్లేనూ, నాదిర్షా, ఘజ్ని, ఘోరీ, సికిందరో ఎవరైతేనం. ఒకొక్కడు మహాహంతకుడు.
వైకింగులు, సేతహూణులు, సింధియన్లు, పారశీకులు, పిండారులు, థగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన.
అజ్ఞానపుటండయుగములో, ఆకలితో, ఆవేశంలో - తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు
అంతా తమ ప్రయోజకతం, తామే భువికాధినాధులమని, స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాల్
ఇతరేతర శక్తులు లేస్తే, పడిపోయిన పేకమేడలై. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను.
చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలూ, ధనవంతుల పన్నాగాలూ, ఇంకానా- ఇకపై చెల్లవు.
ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి, పీడించే సాంఘిక ధర్మం, ఇంకానా? ఇకపై సాగదు.
చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గని పనిమనిషి, ఐర్లాండున ఓడ కళాసీ, అణగారిన ఆర్థులందరూ--
హాటెన్టాట్, జూలూ, నీగ్రో, ఖండాంతర నానాజాతులు చారిత్రక యధార్థతతం చాటిస్తారొక గొంతుకతో
ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో? తారీఖులు దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్రకర్థం
ఈ రాణి ప్రేమ పురాణం, ఆ ముచ్చటకైన ఖర్చులూ, మతలబులూ, కైఫీయతులూ ఇవి కావోయ్ చరిత్రసారం
ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు. దాచేస్తే దాగని సత్యం
నైలునది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది? తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు?
సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బొయిలెవరు?
తక్షశిలా, పాటలీపుత్రం, మధ్యధారా సముద్రతీరం, హరప్పా, మొహేంజొదారో, క్రో మాన్యాన్ గుహముఖాల్లో--
చారిత్రక విభాతసంధ్యల మానవకథ వికాసమెట్టిది? ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్థం?
ఏ శిల్పం? ఏ సాహిత్యం? ఏ శాస్త్రం? ఏ గాంధరం? ఏ వెల్గులకీ ప్రస్థానం? ఏ సప్నమ్? ఏ దిగిజయం?
Here is another master piece of Sri Sri
Comments
Post a Comment