I am not a vivid reader of Telugu literature. But, I happened to read this awesome piece of Sri Sri garu from Maha Prasthanam. I felt that this small piece will be a great addition to my blog. One more reason is, I am not able to find this master piece in Telugu lyrics easily with google search. I only found this written in English primarily.
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్ఛిమ్రోశాను
ఎండకాలం మండినప్పుడు గబ్బిలంవలె క్రాగిపోలేదా
వానాకాలం ముసిరిరాగా నిలువు నిలువున నీరు కాలేదా?
శీతకాలం కోత పెట్టగ కొరడు కట్టీ, ఆకలేసీ కేకలేశానే
నే నొక్కణ్ణే నిల్చిపోతే-
చండ్ర గాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు భూమి మీద భుగ్న మౌతాయి
నింగి నుండీ తొంగిచూసే రంగు రంగుల చుక్కలన్నీ రాలి, నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి
పగుళ్ళన్నీ పగిలిపోయి, నిశీథాలు విశీర్ణిల్లీ, మహా ప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది
నే నొకణ్ణి ధాత్రినిండా నిండిపోయీ- నా కుహురుత శీకరాలే, లోకమంతా జల్లులాడే, ఆ ముహూర్తా లాగమిస్తాయి
నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలుపోతాను
నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను
Comments
Post a Comment