Skip to main content

Posts

Showing posts from March, 2025

భగవద్గీత - అధ్యాయం - 2

కృష్ణ : అర్జునా, యుద్ధక్షేత్ర మధ్యలో ఇలా సంకల్పం లేకుండా ఉండటం నీ వంటి యోధుడికి కీర్తికరం కాదు. నీ ఈ సంధిగ్ధాలను దాటి యుద్ధాన్ని ఆరంభించు.  అర్జున : నాకు దైవ సమానులైన భీష్మ ద్రోణాదుల మీద అస్త్రాలను ఎలా ప్రయోగించగలను? వారిని వధించి వొచ్చే భోగాలను ఎలా అనుభవించగలను? యుద్దాన్ని చేయటం, చేయకపోవడంలో ఏది మంచిదో నాకు అర్థంకావటంలేదు. వొకవేళ యుద్ధం చేసి గెలిచినా, ఇంత మందిని చంపిన తరువాత జీవితేశ్చ ఎలా ఉంటుంది? కృష్ణా, నాకు ఏమి చెయ్యాలో బాధపడటం లేదు. నాపై దయవుంచి నేను చేయదగినది ఎదో నాకు తెలుపు.  కృష్ణ : అర్జునా, నీ మిడిమిడి జ్ఞానంతో నువ్వు అత్యంత ప్రజ్ఞ కలవాడిలా మాట్లాడుతున్నావు. ధుఃకింప తగని వారిని గూర్చి బాధపడుతున్నావు. పండితులు ఉన్నవారిని గురించి గాని చనిపోయిన వారిని గురించిగాని ధుఃఖించరు.  అందరిలో ఉండే ఆత్మను అర్థంచేసుకో. నువ్వు, నేను, సమస్త జీవులు ఎల్లప్పుడూ ఉంటారు. ఏ విధంగా అయితే చిరిగిన వస్త్రాలను వొదిలి కొత్త వస్త్రాలను ధరిస్తామో, అదే విధంగా ఆత్మ ఒక శరీరం వొదిలి మరో కొత్త శరీరాన్ని పొందుతుంది. ఇప్పుడు ఉన్నది ఎల్లప్పుడూ ఉంటుంది, ఇప్పుడు లేనిది మరెప్పుడూ లేదు. ఈ ఆత్మను ఎవరూ నాశన...

భగవద్గీత - అధ్యాయం - 1

దృతరాష్ట్ర మహారాజు యుద్ధ భూమిలో తలపడటానికి సిద్ధంగా ఉన్న తన కుమారులకు మరియు తన తమ్ముని కుమారులకూ ఏమి జరుగుతున్నదో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నాడు. అతను సంజయునితో ఇలా భాషణ మొదలు పెట్టాడు.  దృతరాష్ట్ర : యుద్ధాన్ని ఆరంబించటానికి కురుక్షేత్రం లో సమీకృతమైన నా కుమారులు మరియు నా తమ్ముడు పాండు కుమారులు ఏమి చేస్తున్నారు? సంజయ : మహారాజా, తన గురువు ద్రోణాచార్యుని దెగ్గరకి వెళ్లిన దుర్యోధనుడు, ఇరు సైన్యాలలో ఉన్న ముఖ్య యోధుల గురించి వివరించాడు. ఇంకా ఇలా అన్నాడు- "ఇక్కడ ఉన్న యుద్ధ వీరులందరూ తమ ప్రాణాలని వొదలడానికి సిద్ధపడిన వారు. భీమునిచే రక్షించబడుతున్న పాండవ సైన్య బలం పరిమితం, కానీ బీష్మునిచే రక్షించబడుతున్న కౌరవ సైన్య బలం అపరిమితం. బీష్ముడు యుద్ధంలో ఉన్నంత వరకూ శత్రువులకు విజయం అసాధ్యం. కనుక బీష్ముని కాపాడటం మనకు అత్యంత ముఖ్యం." అవతలి వైపు గాండీవదారి ఐన అర్జునుడు, తన రధసారధి ఐన కృష్ణునితో ఇలా చెప్తున్నాడు.  అర్జున : కృష్ణా, నా కోసం తలబడేవారెవరో, నాతో తలబడేవారెవరో చూడాలని ఉంది. ఈ రధాన్ని ఇరు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళు.  సంజయ : అర్జునిని కోరికమేరకు రధాన్ని ఇరు సైన్యాల మధ్యకి కృష్ణుడు...

భగవద్గీత - ఉపోద్గాతం

ఒక రాజ్య నిజమైన వారసులను సజీవంగా తగలబెట్టే ప్రయత్నం జరిగినప్పుడు; బలమైన రాజ్య మహారాణిని నిండు సభలో వివస్త్రను చేసే ప్రయత్నం జరిగినప్పుడు; భారతదేశ సుసంపన్నమైన రాజ్యా రాజులు పద్నాలుగేండ్లు వనవాసం చేయవలసి వొచ్చినప్పుడు; భగవంతుని తీయని మాటలను ఆలకించలేని దుష్టులు రాజ్యం చేస్తున్నప్పుడు; నానా రాజ్యాల స్పర్ధలు ఒక చోటికి చేరినప్పుడు; యుద్దాన్ని ఆపటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు; రొండు భారీ సైన్యాలు ఇరువైపులా నిలబడినప్పుడు; యుద్ధం అనివార్యమవుతుంది.  కానీ, తన ప్రియమైన వారు ఎదుటి సైన్యంలో ఉన్నప్పుడు, ఏ యోధుడికైనా యుద్ధాన్ని ఆరంభించటం కష్టమే. అదే, తనకు ఇష్టులైన వారిపై బాణాలు సంధించాలి అని గుర్తొస్తే, ఆ యోధుడికి మరింత కష్టం అవుతుంది. మహాభారత కావ్యానికి ముఖ్య నాయకులలో ఒకడైన అర్జునుడికి ఇలాంటి సంధిగ్దమే ఎదురయింది. అదృష్టవశాత్తు, మార్గనిర్ధేశం చేయటానికి అర్జునుడి చెంత రథసారధిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు.  యుద్ధ ఆరంభానికి ఆతృతగా ఇరు పక్షాల సైన్యం ఎదురుచూస్తుంది. ఈ తతంగం మొత్తాన్ని వ్యాస మహాముని  ద్వారా లభ్యమైన దివ్య నేత్రాలతో, దృతరాష్ట్ర మహారాజ రధసారధి ఐన సంజయుడు వీక్షిస్తున్నాడు...

భగవద్గీత - ముందుమాట

భగవద్గీత, భారత దేశపు ఇతిహాసంగా చెప్పబడే మహాభారత కావ్యంలో ఒక చిన్న భాగం. కానీ, ఆ చిన్న భాగమే యావత్ భారతీయ తత్వశాస్త్రాల సారాంశంగా పరిగణించబడుతుంది. అనాదిగా కోట్లాది భారతీయులకు దిక్సూచి అయ్యింది. అన్ని కాలాలకు, అన్ని తరాలకు సరిపడినట్టుగా ఉండే ఈ పుస్తకం, ఎప్పుడూ కొత్తదే.  మనిషి తీసుకోదగిన మూడు మార్గాలను ఈ పుస్తకం ఉపదేశిస్తుంది. అవి జ్ఞాన యోగం, కర్మ యోగం మరియు భక్తి యోగం. ఈ బ్లాగులో నేను జ్ఞాన మరియు కర్మ యోగాల గురించి ఎక్కువగా పేర్కొంటాను. భక్తి యోగం గురించి కొంచమే ప్రస్తావిస్తాను. భక్తి యోగం గురించి తెలుసుకోవాలి అని కోరుకుంటున్నవారికి చాల అద్భుతమైన పుస్తకాలూ ఉన్నాయి.  మరలా, అందరికీ సులువుగా అర్థమవ్వాలన్న ఉద్దేశంతో కొంత ఎక్కువగా సులభీకరించాను. కానీ, భగవద్గీత ఉద్దేశాన్ని ఎక్కడా మార్చను.