ఒక రాజ్య నిజమైన వారసులను సజీవంగా తగలబెట్టే ప్రయత్నం జరిగినప్పుడు; బలమైన రాజ్య మహారాణిని నిండు సభలో వివస్త్రను చేసే ప్రయత్నం జరిగినప్పుడు; భారతదేశ సుసంపన్నమైన రాజ్యా రాజులు పద్నాలుగేండ్లు వనవాసం చేయవలసి వొచ్చినప్పుడు; భగవంతుని తీయని మాటలను ఆలకించలేని దుష్టులు రాజ్యం చేస్తున్నప్పుడు; నానా రాజ్యాల స్పర్ధలు ఒక చోటికి చేరినప్పుడు; యుద్దాన్ని ఆపటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు; రొండు భారీ సైన్యాలు ఇరువైపులా నిలబడినప్పుడు; యుద్ధం అనివార్యమవుతుంది.
కానీ, తన ప్రియమైన వారు ఎదుటి సైన్యంలో ఉన్నప్పుడు, ఏ యోధుడికైనా యుద్ధాన్ని ఆరంభించటం కష్టమే. అదే, తనకు ఇష్టులైన వారిపై బాణాలు సంధించాలి అని గుర్తొస్తే, ఆ యోధుడికి మరింత కష్టం అవుతుంది. మహాభారత కావ్యానికి ముఖ్య నాయకులలో ఒకడైన అర్జునుడికి ఇలాంటి సంధిగ్దమే ఎదురయింది. అదృష్టవశాత్తు, మార్గనిర్ధేశం చేయటానికి అర్జునుడి చెంత రథసారధిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు.
యుద్ధ ఆరంభానికి ఆతృతగా ఇరు పక్షాల సైన్యం ఎదురుచూస్తుంది. ఈ తతంగం మొత్తాన్ని వ్యాస మహాముని ద్వారా లభ్యమైన దివ్య నేత్రాలతో, దృతరాష్ట్ర మహారాజ రధసారధి ఐన సంజయుడు వీక్షిస్తున్నాడు. సంజయుడు, యుద్ధ క్షేత్రంలో జరుగుతున్నదంతా దృతరాష్టునికి తెలుపుతున్నాడు
Comments
Post a Comment