భగవద్గీత, భారత దేశపు ఇతిహాసంగా చెప్పబడే మహాభారత కావ్యంలో ఒక చిన్న భాగం. కానీ, ఆ చిన్న భాగమే యావత్ భారతీయ తత్వశాస్త్రాల సారాంశంగా పరిగణించబడుతుంది. అనాదిగా కోట్లాది భారతీయులకు దిక్సూచి అయ్యింది. అన్ని కాలాలకు, అన్ని తరాలకు సరిపడినట్టుగా ఉండే ఈ పుస్తకం, ఎప్పుడూ కొత్తదే.
మనిషి తీసుకోదగిన మూడు మార్గాలను ఈ పుస్తకం ఉపదేశిస్తుంది. అవి జ్ఞాన యోగం, కర్మ యోగం మరియు భక్తి యోగం. ఈ బ్లాగులో నేను జ్ఞాన మరియు కర్మ యోగాల గురించి ఎక్కువగా పేర్కొంటాను. భక్తి యోగం గురించి కొంచమే ప్రస్తావిస్తాను. భక్తి యోగం గురించి తెలుసుకోవాలి అని కోరుకుంటున్నవారికి చాల అద్భుతమైన పుస్తకాలూ ఉన్నాయి.
మరలా, అందరికీ సులువుగా అర్థమవ్వాలన్న ఉద్దేశంతో కొంత ఎక్కువగా సులభీకరించాను. కానీ, భగవద్గీత ఉద్దేశాన్ని ఎక్కడా మార్చను.
Comments
Post a Comment