The voice of Ghantasala gave life to wonderful slokas from Bhagavadgita.
How can I forget this masterpiece from Maha Prasthanam. How Sri Sri has summarized the history of every nation in his blunt words ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణతం నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహరణోద్యోగం. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం బీభత్సరస ప్రధానం పిశాచగుణ సమవాకారం. నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులని కాల్చుకుతినటం. బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు. నరహంతులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి. రణరంగం కానిచోట భూస్థలమంతా వెదకిన దొరకదు. గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళులతో. చల్లారిన సంసారాలు, మరణించిన జన సందోహం, అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నవి. వైషమ్యం, స్వార్ధపరతం, కౌటిల్యం, ఈర్షలు, స్పర్ధలు. మాయలతో మారు పేర్లతో చరిత్రగతి నిరూపించినవి. చెంఘీజ్ ఖాన్, తామర్లేనూ, నాదిర్షా, ఘజ్ని, ఘోరీ, సికిందరో ఎవరైతేనం. ఒకొక్కడు మహాహంతకుడు. వైకింగులు, సేతహూణులు, సింధియన్లు, పారశీకులు, పిండారులు, థగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన. అజ్ఞానపుటండయుగములో, ఆకలితో, ఆవేశంలో...
Comments
Post a Comment