దృతరాష్ట్ర మహారాజు యుద్ధ భూమిలో తలపడటానికి సిద్ధంగా ఉన్న తన కుమారులకు మరియు తన తమ్ముని కుమారులకూ ఏమి జరుగుతున్నదో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నాడు. అతను సంజయునితో ఇలా భాషణ మొదలు పెట్టాడు.
దృతరాష్ట్ర: యుద్ధాన్ని ఆరంబించటానికి కురుక్షేత్రం లో సమీకృతమైన నా కుమారులు మరియు నా తమ్ముడు పాండు కుమారులు ఏమి చేస్తున్నారు?
సంజయ: మహారాజా, తన గురువు ద్రోణాచార్యుని దెగ్గరకి వెళ్లిన దుర్యోధనుడు, ఇరు సైన్యాలలో ఉన్న ముఖ్య యోధుల గురించి వివరించాడు. ఇంకా ఇలా అన్నాడు- "ఇక్కడ ఉన్న యుద్ధ వీరులందరూ తమ ప్రాణాలని వొదలడానికి సిద్ధపడిన వారు. భీమునిచే రక్షించబడుతున్న పాండవ సైన్య బలం పరిమితం, కానీ బీష్మునిచే రక్షించబడుతున్న కౌరవ సైన్య బలం అపరిమితం. బీష్ముడు యుద్ధంలో ఉన్నంత వరకూ శత్రువులకు విజయం అసాధ్యం. కనుక బీష్ముని కాపాడటం మనకు అత్యంత ముఖ్యం."
అవతలి వైపు గాండీవదారి ఐన అర్జునుడు, తన రధసారధి ఐన కృష్ణునితో ఇలా చెప్తున్నాడు.
అర్జున: కృష్ణా, నా కోసం తలబడేవారెవరో, నాతో తలబడేవారెవరో చూడాలని ఉంది. ఈ రధాన్ని ఇరు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళు.
సంజయ: అర్జునిని కోరికమేరకు రధాన్ని ఇరు సైన్యాల మధ్యకి కృష్ణుడు తీసుకువెళ్లాడు. ఇరు సైన్యాలలో ఉన్న తన కుటుంబ సభ్యులను, మిత్రులనూ చుసిన అర్జునుడు తన ఆలోచనలను కృష్ణునితో పంచుకుంటున్నాడు.
అర్జున: కేశవా, నాకు ఇప్పుడు నేను చెయ్యబోయే యుద్ధ ఫలితం కనిపిస్తుంది. ఇది మిగల్చబోయే విధ్వంసం కనిపిస్తుంది. ఇంతమంది చావుతో వొచ్చే విజయమూ మరియు రాజ్యమూ నాకు వొద్దు. ఈ జీవితం కేవలం రాజ్యం కొరకు మరియు కోరికలను తీర్చుకోవటానికేనా?
నాకు ప్రియులైన వారు, తమ సంపదనూ ప్రాణాలనూ కోల్పోవటానికి సిద్దపడుతున్నప్పుడు. వారితో యుద్ధం చేయటానికంటే, వారిచేత చంపబడటమే నాకు మంచిది. నా ఈ నిర్ణయం కేవలం ఈ రాజ్య సింహాసనం ఇస్తేనే కాదు, ఈ సమస్త ప్రపంచ సింహాసనం ఇచ్చినా మారదు.
ఈ యుద్ధం లక్షలాది ప్రజల మరణానికి కారణం అవుతుంది. పాపిని చంపినా కూడా మనకి పాపమే కలుగుతుంది. అందువల్ల, ఈ కౌరవులను చంపడం వొల్ల ఉపయోగం లేదు. దురాశతో, అహంకారంతో నిండిన ఈ కౌరవులు ఈ యుద్ధ అనర్ధాన్ని చూడలేకపోతున్నారు. వారిని అలానే ఉండనివ్వు. కానీ, ఏమి జరగబోతున్నదో తెలుసుకున్న మనం యుద్ధం చెయ్యకూడదు. నిరాయుధుడిగా ఉన్న నాపై తమ వొద్ద ఉన్న ఆయుధాలతో కౌరవులు దాడి చేసి నన్ను సంహరించవొచ్చు. అనేక మంది మరణానికి కారకులం అవ్వటంకన్నా, ఆ విధంగా మరణించడమే నాకు మేలు.
Comments
Post a Comment